KMM: రైతులకు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యక్ష ప్రసార వీక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు.