VSP: విశాఖ ఏయూ న్యాయ కళాశాలలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కే. రామస్వామి చిత్రపటాన్ని శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, జస్టిస్ రామస్వామి గతంలో ఏయూలో ‘పబ్లిక్ పవర్ అండ్ జ్యూడిషియల్ ఫంక్షన్’ అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని పునర్ముద్రించిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.