BDK: పాల్వంచ సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం సందర్శించారు. రైతుల వద్ద నుంచి పాల సేకరణ కేంద్రం, విజయ డైరీ ద్వారా కేంద్ర ఏర్పాటు, సొసైటీ భవన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తోపాటు పాలకవర్గం సభ్యులు రైతు సమస్యలపై కలెక్టర్కు వివరించారు.