SRPT: మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే బాధ్యులపై చర్యలు తప్పవని కోదాడ టౌన్ సీఐ శివశంకర్ అన్నారు. శనివారం పట్టణంలో మైనర్లు డ్రైవింగ్ చేసినటువంటి 35 ద్విచక్ర వాహనాలు, వాటినీ డ్రైవ్ చేసిన వ్యక్తులు వారి తల్లిదండ్రులు అందరికీ పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కలిగిఉండాలన్నారు.