KKD: తుని మండలంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆలయ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు,ఎస్కలేటర్ ఏర్పాటు వంటి కార్యక్రమాల పురోగతిని విచారించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి,అమ్మవారి చిత్రపటం,ప్రసాదాలు అందజేశారు.