KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెంలో కంటే లక్ష్మి శనివారం ఉదయం కళ్లు తిరిగి పడిపోయింది. 108కి సమాచారం అందించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.