SDPT: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎం.పద్మ డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేటలో ఆమె మాట్లాడుతూ.. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.