VZM: గంట్యాడ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం సందర్శించారు. స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రికార్డులను తనిఖీ చేసి కేసులపై ఆరా తీశారు. చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని.. ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చే గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. గంజాయి రవాణాను అరికట్టాలని ఆదేశించారు.