VZM: బొండపల్లి మండలం ఒంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలిక విధ్య సమాజాభివృద్ధికి మూలాధారం అన్నారు. ఆడపిల్లలు ఏ రంగంలోనూ మగవారికి తీసిపోరన్నారు. బాలికలకు సక్రమమైన విద్యను అందించగలిగితే అన్ని రంగాలలో రాణించగలరన్నారు.