NZB: మద్యం షాపుల టెండర్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శనివారం రోజున 34 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు గాను ఇప్పటి వరకు 149 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు.