AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం చిత్తూరులో 34.2mm, తూ.గో(D) లక్ష్మీపురంలో 31mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.