GNTR: ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణ అన్నారు. శనివారం సాయంత్రం ఫిరంగిపురంలోని సొలస బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వారిని, లైసెన్స్ లేని వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం డివైడర్లు వద్ద ప్రమాదాలు జరగకుండా రేడియం స్టిక్కర్లు అంటించారు.