NZB: రైతులు పండించిన సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఉమ్మడి కోటగిరి మండల రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. గత రబీ సీజన్లో రైతులకు ప్రకటించిన బోనస్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.