BHNG: మోట కొండూరు(M)చాడ గ్రామానికి చెందిన గంధమల్ల సైదులు(27)దసరా రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడి, HYDలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. వైద్యులు అతనికి బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో వైద్య బృందం జీవన్ దాన్పై కుటుంబానికి అవగాహన కల్పించింది. వారు ముందుకు రావడంతో ఆయన అవయవాలను ఇవాళ దానం చేశారు. ఈ అవయవాలతో 8మందికి జీవితాన్ని అందించే వారయ్యారు.