NZB: ఆర్మూర్ పట్టణంలోని క్షత్రీయ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆర్మూర్ పట్టణ పద్మశాలీల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్‌ను కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. శనివారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.