AKP: నాతవరంలోని అయ్యప్ప ఫైర్ వర్క్స్ నిల్వ, విక్రయ కేంద్రాలను తహసీల్దార్ పీ.రామారావు, నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు ఫైర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలు తప్పనిసరిగా భద్రత పాటించాలని ఎస్సై తారకేశ్వరరావు సూచించారు.