కేరళ వ్యవసాయ మంత్రి పి.ప్రసాద్ అడవి పందుల సమస్యపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అడవి పందుల కారణంగా పంట నష్టం గురించి ప్రజలు ఫిర్యాదు చేయగా, ఆయన వారికి షాకింగ్ సూచన ఇచ్చారు. ‘అడవి పందులను చంపి తినడమే సమస్యకు ఏకైక పరిష్కారం. చంపడానికి కేంద్రం అనుమతివ్వదు. పంట నష్టాన్ని నివారించాలంటే, వాటిని చంపి తినేందుకు కేంద్రం ప్రజలకు అనుమతివ్వాలి’ అని మంత్రి అన్నారు.