CTR: పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలోని కురప్పల్లి వంతెన ప్రస్తుత వర్షాలకు దెబ్బతిని ప్రమాద కరంగా మారాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వెంటనే మరమ్మతు పనులు చేయించాలని పలమనేరు MLA అమరనాథ రెడ్డికి పంచాయతీ వాసులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటముని రెడ్డి, చంద్రశేఖర్, విశ్వ నాథ రెడ్డి,పూర్ణ చంద్ర, అమరనాథ పాల్గొన్నారు.