JN: జనగామ పట్టణ కేంద్రానికి చెందిన బీసీ సంఘం నేతలు బీసీ నేత ఆర్.కృష్ణయ్యను హైదరాబాదులో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సందర్భంగా ఈ నెల 14న తెలంగాణ బందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బందును విజయవంతం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజకీయాలు అతీతంగా బీసీ సంఘం నేతలు బంద్‌లో పాల్గొనున్నారు.