VSP: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పట్ల గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ కలెక్టర్ సతీమణి, అడ్వకేట్ దివ్య ప్రసాద్ అన్నారు. అక్టోబర్ ‘పింక్ మంత్’లో భాగంగా శనివారం కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కే. శిల్ప ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.