ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘పప్పుధాన్యాల ఆత్మనిర్భరత’ను కూడా ప్రారంభించారు. ఈ ధనధాన్య కృషి యోజన పథకానికి తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 జిల్లాలు(AP-4, TG-4) ఎంపికయ్యాయి.