BPT: జిల్లాలో కిశోరి బాలికల కోసం“కిశోరి వికాసం 2.0” ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కిశోరి బాలికల పూర్తి సాధికారత కోసం నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహార ఆరోగ్యం,లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మానవ అక్రమ రవాణా వంటి 12 కీలక అంశాల్లో అవగాహన కల్పిస్తారని తెలిపారు.