KDP: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 ఖోఖో పోటీలలో వల్లూరు మండలంలోని గంగాయపల్లె ఏపీ మోడల్ కళాశాలకు చెందిన విద్యార్థినులు కే.చంద్రకళ, ఎన్. అనిలా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు శనివారం సంజీవపురం ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ జూనియర్ కళాశాలలో జరిగాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రకళ, అనిలాను కళాశాల యాజమాన్యం అభినందించారు.