ADB: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయిపై దాడి గర్హనీయమని MRPS జిల్లాధ్యక్షుడు ఆరేళ్లి మల్లేష్ అన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన ఘటనను సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రాకేష్ కిషోర్‌ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నిర్వహించే నల్లజెండాలతో నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.