E.G: నల్లజర్లలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం – 2025 కార్యక్రమాన్ని అంగన్వాడి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం MLA మద్దిపాటి వెంకట రాజు హాజరై మాట్లాడారు. గర్భిణీలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భంలోని శిశువు పెరుగుదల బాగుంటుందని ఆయన తెలిపారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు.