రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ పైచేయి సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. జైస్వాల్ (175), గిల్ (129) సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.