ప్రకాశం: కొండపి వైన్ షాప్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న ముక్కోటిపాలెం గ్రామంకు చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడిని 2023 ఏప్రిల్ నెలలో హత్య చేశారు. కాగా సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో కేసు ట్రైల్స్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం ముద్దాయి హనుమంతరావుకి కోర్టులో యావజీవ శిక్ష ఖరారు చేసినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.