KDP: కడప నగరంలోని లా కాలేజ్ బ్రిడ్జ్, షామీరియా బ్రిడ్జ్ నిర్మాణ పనులను శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. కడప ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని కోరారు.