NDL: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని నంద్యాల ASP జావలి శనివారం తెలిపారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో దీపావళి సందర్భంగా వ్యాపారస్తులు ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచరాదని సూచించారు. అలా ఎవరైనా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.