ELR: జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలకు చేరాలని, పాత జీఎస్టీ ధరలకు విక్రయించే వర్తకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో 8712631283 నంబర్ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8712631279 నంబర్ అందుబాటులో ఉందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.