ASR: 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ సాగిన ధర్మన్న పడాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఈనెల 13న పాడేరు ఐటీడీఏ ముట్టడిస్తామని తెలిపారు. శనివారం పాడేరులో సమావేశం నిర్వహించారు. 100 శాతం రిజర్వేషన్ లేకపోవడంతో మెగా డీఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని తెలిపారు.