అన్నమయ్య: రాయచోటి పట్టణంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులకు శనివారం ట్రాఫిక్ స్టేషన్లో సీఐ ఎస్. కులాయప్ప కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మైనర్లకు బైకులు ఇవ్వడం ప్రమాదకరమని, ఇకపై ఇలా జరిగితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.