GDWL: కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు అవసరమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం వడ్డేపల్లి మండలం శాంతినగర్లో సిఐటియు మండల రెండవ మహాసభలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తుందన్నారు.