CTR: సదుం మండలం కొత్తపల్లి శ్రీవారి పాదక్షేత్రంలో పెరటాసి మాసం నాలుగవ శనివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించి సహస్ర నామార్చన, విశేషా అలంకారం చేశారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించి స్వామివారి పాదాలకు పూజలు చేశారు. బూరగమంద భూదేవి, శ్రీదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ పూజలు జరిగాయి.