కృష్ణా: నందివాడ మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై పెద్దవిరివాడకు వెళ్తుండగా దారి మధ్యలో ఆయనపై శనివారం కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో నాగేశ్వరరావు వాహనం నుండి కిందకి పడిపోయారు గాయపడిన నాగేశ్వరావును గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. కుక్కల బెడద నుండి కాపాడాలని ఆయన కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు.