MNCL: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను శనివారం అరెస్టు చేసినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. కాగజ్ నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీ చేసే క్రమంలో ఏల్పుల వర్శిత్, రాహుల్, ఐ. మనిదీప్ను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.