KDP: మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో సైడ్ లాక్ వేయకుండా పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం పట్టణ సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం ఫైన్లు విధించి, భవిష్యత్తులో సైడ్ లాక్ వేసుకోవాలని సూచించారు. కాగా, దొంగతనాలు అరికట్టేందుకు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని తెలిపారు.