BDK: భద్రాద్రి జిల్లా పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానం దిశగా దూసుకుపోతోంది. దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 2024-25 ఫ్రూట్ ఇయర్లో ఉత్పత్తి, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు (ఓఈఆర్)పరంగా సరికొత్త గోల్డెన్ రికార్డును నెలకొల్పింది. దశాబ్ద కాలంలోనే అత్యధిక దిగుబడి, రికవరీ శాతాన్ని నమోదు చేసి, రాష్ట్ర పామాయిల్ సాగు రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.