కృష్ణా: జిల్లాలోని రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలని నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ఆయిల్ ఫామ్, కొరమేను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కృషి యోజన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ బాలాజీ, కేవీకే అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.