MBNR: గండీడ్ గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన దశదిన కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లారని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.