CTR: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పుంగనూరులో ఓట్ చోరీ-గద్ది చోడ్ కార్యక్రమాన్ని నాయకులు శనివారం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ భాష, ముబారక్ భాషా, ఫయాజ్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.