KMR: జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లు శనివారం ధర్నా నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా అక్టోబర్ 1 నుంచి విధుల్లోకి రాకూడదని సూపరింటెండెంట్ హెచ్చరించారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించామన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని, వేతనాలు చెల్లించాలన్నారు.