NZB: జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్డులో వన్‌వే నిబంధనల అమలుతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ వ్యాపారస్తులు శనివారం తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. వన్‌వేను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ఈ నిబంధనల వల్ల తమ వ్యాపారాలు నడవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.