E.G: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వారి ప్రచార రథం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా ప్రచారం చేసుకుంటూ జగ్గంపేట చేరుకుంది. ఈ రథానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, అన్నవరం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) ఘన స్వాగతం పలికి పోస్టర్ ఆవిష్కరించారు.