NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలో శనివారం సీసీ కెమెరాలు ఏర్పాటుకు మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి గ్రామస్తులకు రూ. 7 లక్షల విరాళం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామ భద్రత కోసం ముందడుగు వేసిన అతడికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.