E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ GST’పై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి ప్రజలు రోజు వాడే వస్తువులపై GST తగ్గించి పేదలకు కొంత భారం తగ్గించాలనే ఉద్దేశంతో 373 రకాల వస్తువుల మీద GST తగ్గించరన్నారు.