‘వికసిత్ భారత్’ కోసం రైతులు కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా వరి, గోధుమలతో పాటు పప్పుల సాగును పెంచాలని రైతులకు సూచించారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలు పండించాలన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ. 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని పేర్కొన్నారు.