AKP: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకురావడంతో వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు తగ్గినట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం అచ్యుతాపురం మండలం హరిపాలెంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గడంతో రైతులకు వ్యవసాయ పెట్టుబడి వ్యయం తగ్గుతుందన్నారు.