ATP: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధన-ధాన్య కృషి యోజన’ (PMDDKY) పథకానికి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి. ఆరేళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో దేశంలో పంటల ఉత్పాదన, సాంద్రత, రుణపరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృష్టితో ఈ పథకాన్ని చేపట్టినట్లు జిల్లా అధికారులు తెలిపారు.