BHPL: BC రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ను ఎత్తివేసింది. గోరికొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో వివిధ పార్టీల జెండా గద్దెలు, శంకుస్థాపన శిలాఫలకాలకు అధికారులు గతంలో ముసుగులు వేశారు. ప్రస్తుతం కోడ్ ఎత్తివేసినప్పటికీ ఆ ముసుగులు తొలగించలేదు. మళ్లీ కోడ్ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు వాటిని యథాతథంగా ఉంచుతున్నారు.